మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గిరి ఎవరికో..?

0
33

పలమనేరు (చిత్తూరు జిల్లా): పలమనేరు నియోజక వర్గంలో అతిపెద్ద నామినేటేడ్‌ పదవిగాను, నియోజక వర్గస్థాయి పదవిగా నేతలు భావించే పలమనేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గిరి ఈసారి ఎవరిని వరిస్తుం దోనని నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీలో ఉండి, అప్పటి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన అమరనాథరెడ్డితో పాటు టీడీపీలోకి వెళ్లిన హేమంత్‌ కుమార్‌ రెడ్డి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా గత ప్రభుత్వ హయాంలో నియ మితులయ్యారు. అటుపిమ్మట కొద్దికాలం అమరనాథ రెడ్డి మంత్రి కావడంతో ఆయనతో పాటు కొనసాగారు. అయితే శాసనసభ ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధ్య క్షుడు జగన్‌ పలమనేరుకు వచ్చిన సందర్భంగా హేమంత్‌కుమార్‌ రెడ్డి తన పదవికి, టీడీపీ సభ్యత్వా నికి రాజీనామా చేసి, వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఆయన ఈ పదవిని మళ్లీ ఆశిస్తున్నారు. జిల్లాకు చెం దిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా హేమంత్‌కుమార్‌ రెడ్డికే మార్కెట్‌ కమిటీ పదవి కట్ట బెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు హేమంత్‌కుమార్‌ సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఈ పదవిపై నియోజకవర్గంలోని గంగవరం, పెద్దంపజాణి, వి.కోట మండలాలకు చెందిన నేతలు కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here