Home Andhra టమోటా ధరల తగ్గుముఖం

టమోటా ధరల తగ్గుముఖం

మదనపల్లె టౌన్‌, నవంబరు 17: మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు తగ్గుముఖం పట్టాయి. వారంరోజుల్లో వంద మెట్రిక్‌ టన్నుల దిగుబడులు తగ్గినా ధరలు పెరగడం లేదు. కాగా, పట్టణ టమోటా మార్కెట్‌కు నిత్యం 450 మెట్రిక్‌ టన్నులు వస్తుండగా, రెండు రోజులుగా 350 టన్నులు మాత్రమే విక్రయానికి వస్తున్నాయి. ఆ మేరకు ధరలు పెరగాల్సినా తగ్గుముఖం పడుతున్నాయి. తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌, కడప జిల్లా మైదుకూరు ప్రాంతాల్లో టమోటా దిగుబడులు పెరగడమే కారణమని వ్యాపారులు అంటున్నారు. దీంతో రెండు రోజులుగా మదనపల్లె మార్కెట్‌లో మొదటి రకం టమోటా కిలో రూ.24 నుంచి 20కి, రెండో రకం రూ.6కి పడిపోయింది. గతంలో స్థానిక మారెట్‌ నుంచి విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీ, తమిళనాడు ప్రాంతాలకు టమోటా ఎగుమతులు జరిగేవి. దిండిగల్‌ నుంచి రోజూ 500 టన్నుల టమోటా తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. అన్నీవెరసి మదనపల్లె టమోటాకు డిమాండ్‌ తగ్గడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

టమోటా ధరల తగ్గుముఖం

మదనపల్లె టౌన్‌, నవంబరు 17: మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు తగ్గుముఖం పట్టాయి. వారంరోజుల్లో వంద మెట్రిక్‌ టన్నుల దిగుబడులు తగ్గినా ధరలు పెరగడం లేదు. కాగా, పట్టణ టమోటా మార్కెట్‌కు...

కుప్పానికి ఇన్‌చార్జి చంద్రమౌళే.. తేల్చిచెప్పిన ఉప ముఖ్యమంత్రి

కార్వేటినగరం/కుప్పం (చిత్తూరు జిల్లా): కుప్పం నియోజకవర్గానికి చంద్రమౌళే వైసీపీ ఇన్‌చార్జిగా ఉంటారని ఇందులో ఎలాంటి మార్పు లేదని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. తాను, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,...

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గిరి ఎవరికో..?

పలమనేరు (చిత్తూరు జిల్లా): పలమనేరు నియోజక వర్గంలో అతిపెద్ద నామినేటేడ్‌ పదవిగాను, నియోజక వర్గస్థాయి పదవిగా నేతలు భావించే పలమనేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గిరి ఈసారి ఎవరిని...