కుప్పానికి ఇన్‌చార్జి చంద్రమౌళే.. తేల్చిచెప్పిన ఉప ముఖ్యమంత్రి

0
38

కార్వేటినగరం/కుప్పం (చిత్తూరు జిల్లా): కుప్పం నియోజకవర్గానికి చంద్రమౌళే వైసీపీ ఇన్‌చార్జిగా ఉంటారని ఇందులో ఎలాంటి మార్పు లేదని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. తాను, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ నియోజక అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఆదివారం పుత్తూరులో స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలప్పుడు చంద్రమౌళి అనారోగ్యంతో బాధపడ్డారని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. కుప్పాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి జగన్‌ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తెలిపారు. పెనుమూరు-నేండ్రగుంట, పచ్చికా పల్లం- కార్వేటినగరం, చింతమండి-పచ్చికాపల్లం, పచ్చికాపల్లం- కొత్తపల్లెమిట్ట వరకు రెండులైన్ల బీటీ రోడ్డు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here